రాష్ట్రంలో 24 గంటల్లో 1021 కరోనా కేసులు..

86
telangana corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీ సంఖ్యలో తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,021 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6గురు మృతిచెందారు.

దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,13,084కు చేరుకోగా 1,87,342 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1228 మంది మృతిచెందారు.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.57 శాతంగా ఉండగా రికవరీ రేటు 87.91 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 30,210 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇప్పటివరకు 35,77,261 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.