దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం మరియు ఆందోళనల వేళ ముంబై వీధుల్లో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో దాదాపు 40 నిమిషాల పాటు ఒక యంగ్ మోడల్, పోలీసు వాహనానికి ఎదురుగా నిలబడి నిరసన తెలుపడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనల్లో భాగంగా పోలీసులు పలువురు విద్యార్థులను, నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీసు వ్యాన్‌లో తరలించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న 27 ఏళ్ల మోడల్, నటి రియా ఆహిర్ వ్యాన్ ముందరకు వచ్చి నిలబడి దానిని ముందుకు కదలకుండా అడ్డుకుంది.
వర్షం పడుతున్నప్పటికీ రియా ఆహిర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసు వాహనం ముందే మోహరించింది. లోపల ఉన్న అభ్యర్థులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేసింది. వ్యాన్‌లో విద్యార్థులను కిక్కిరిసి పూడ్చారు, వారిని అలా తీసుకెళ్లడానికి వీల్లేదు అని స్పష్టం చేసింది.
దాదర్ వ్యాప్తంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో మరియు ప్రజల నుండి మద్దతు పెరగడంతో పోలీసులు చివరికి దారివ్వక తప్పలేదు. వాహనంలో ఉన్న నిరసనకారులను అక్కడే విడుదల చేయడంతో ఈ వివాదం ముగిసింది. ఈ ఘటనపై రియా ఆహిర్ స్పందిస్తూ.. “నేను కూడా భయపడ్డాను, కానీ నా భయం కంటే నా నిశ్చయం బలంగా ఉంది. పోలీసు వ్యాన్ అలా వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటే ఒక పౌరురాలిగా నేను విఫలమైనట్లే. నా తండ్రి ఐటీబీపీ (ITBP)లో సేవలు అందించారు. ఆ ధైర్యమే నన్ను ఇలా నిలబెట్టింది అని తెలిపింది.
Also Read:వైభవ్‌పై శ్రేయాస్ ప్రశంసలు

