NEET పేపర్ లీక్ నిరసనలపై ఫేక్ ప్రచారం

3
- Advertisement -

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద NEET పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహిస్తున్న నిరసనలకు సంబంధించి నకిలీ వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న 480 పాకిస్తాన్ లింక్ ఉన్న సోషల్ మీడియా హ్యాండిళ్లను గుర్తించి బ్లాక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. విద్యార్థులు, పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అధికారిక మూలాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో నిర్ధారించని అంశాలను షేర్ చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో ఈ హెచ్చరిక వెలువడింది.

డిసిపి (DCP) సుమిత్ ఝా మాట్లాడుతూ…సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారం ప్రచారంలో ఉన్నట్లు తాము గమనించామని, నిరసనలపై అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ నుండి నడిచే వందలాది ఖాతాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.

సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారం ప్రచారమవుతున్నట్లు మేము గమనించాము. ఇప్పటివరకు 480కి పైగా పాకిస్తాన్ లింక్ ఉన్న సోషల్ మీడియా ఖాతాలను గుర్తించాము. ఇవి పరిస్థితిని ఆసరాగా చేసుకుని అసత్య సమాచారాన్ని, పుకార్లను వ్యాప్తి చేస్తున్నాయి. ఈ ఖాతాలను బ్లాక్ చేస్తున్నాము అని పోలీసులు తెలిపారు.

Also Read:సోనమ్ దీక్ష విరమణపై అభిజిత్

ఈ గుర్తించిన హ్యాండిళ్లలో చాలావరకు “ఆపరేషన్ సిందూర్‌” సమయంలో కూడా చురుగ్గా ఉన్నాయని, అదే నెట్‌వర్క్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న నిరసనలపై ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.

- Advertisement -