CJP ఉద్యమం..దేశం మొత్తానిది!

1
- Advertisement -

జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమంపై వస్తున్న రాజకీయ వ్యాఖ్యలకు సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ఈ ఉద్యమాన్ని ఏ ఒక్క వ్యక్తి లేదా రాజకీయ పార్టీకి పరిమితం చేయడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.

“ఈ ఉద్యమం సోనమ్ వాంగ్‌చుక్‌ది కాదు… అభిజిత్ దీప్కేది కాదు. ఇది దేశం మొత్తానికి సంబంధించిన ఉద్యమం. ఇది ప్రతిపక్ష పార్టీల ఆందోళన కూడా కాదు. దేశ యువత తమ భవిష్యత్తు, విద్యా వ్యవస్థ పారదర్శకత కోసం చేస్తున్న పోరాటం” అని దీప్కే పేర్కొన్నారు.

నీట్‌ సహా పలు పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్‌లు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించాయని ఆయన అన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారు రాజకీయ కార్యకర్తలు కాదని, తమ హక్కులు, న్యాయం కోరుతున్న విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, సాధారణ ప్రజలేనని వివరించారు.

సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపారని, కానీ ఉద్యమాన్ని ఆయన వ్యక్తిగతంగా నడిపించడం లేదని దీప్కే స్పష్టం చేశారు. అలాగే, తన పేరుతో కూడా ఈ ఉద్యమాన్ని ముడిపెట్టవద్దని కోరారు.

Also Read:‘జన నాయగన్’..కన్నీరు పెట్టుకున్న నటి!

ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని రాజకీయ కోణంలో కాకుండా, దేశ యువత గళంగా గుర్తించి వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల పారదర్శకత, బాధ్యులపై చర్యలు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని దీప్కే స్పష్టం చేశారు.

- Advertisement -