ప్రశ్నిస్తే దేశ ద్రోహులమా?

4
- Advertisement -

ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అవుతారా? అని ఇందిరా పార్క్ దగ్గర చేపట్టిన నిరసనలో ఓ విద్యార్ధిని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీ ఛార్జ్ పేరిట బీజేపీ ప్రభుత్వం గూండాగిరి చేస్తుంది, గూండాలను పోలీస్ వేషంలో పంపి విద్యార్థులపై దాడులు చేయిస్తుంది.. విద్యా వ్యవస్థ బాగుపడాలని పోరాడితే తప్పేంటి? అని ప్రశ్నించారు.

కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినా తప్పు జరిగితే ప్రశ్నిస్తూనే ఉంటాం.. దమ్ముంటే బీజేపీ మంత్రులను NEET పరీక్ష రాయమనండి, అప్పుడు మా బాధ అర్థమవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా, యూట్యూబర్లే మా బాధ అర్థం చేసుకుంటున్నారు…మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు మా బాధను పట్టించుకోవడం లేదు… ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు .. ఢిల్లీలో విద్యార్థినిలపై పోలీసుల దౌర్జన్యం చూస్తే కంట్లో నీళ్లు తిరిగాయి అన్నారు.బయట నుండి ఫండింగ్ రావడం కాదు మేమే మా సొంత డబ్బులతో జంతర్ మంతర్ దగ్గరికి ఆహారం పంపిస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

విదేశాలకు వెళ్లడం ఆపేసి ముందు నీ దేశ ప్రజలకు ఏం కావాలో ఆలోచించు మోదీ… ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా విద్యార్థులపై ఆరోపణలు చేసే వారే నిజమైన యాంటీ నేషనల్… తప్పు చేస్తే ప్రజలు నిలదీస్తారని భయం ప్రభుత్వాలకు ఉండాలి అన్నారు.

Also Read:సోనమ్ దీక్ష విరమణపై అభిజిత్

బయటికి వచ్చి తప్పు ఒప్పుకునే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదు… ఇంటర్నేషనల్ ఫండింగ్ వస్తే ఇక్కడ వర్షంలో తడుస్తూ ఎందుకు నిరసన తెలుపుతాము, పెద్ద ఎల్బీ స్టేడియంలో నిరసనలు చేస్తాం కదా?.. మా పిల్లలు చనిపోయారు, రేపు ఇంకొకరి పిల్లలు చనిపోవద్దని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -