24న తెలంగాణ బంద్:నిరుద్యోగ జేఏసీ

3
- Advertisement -

ఈ నెల 24 న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది నిరుద్యోగ జేఏసీ. దిల్ సుఖ్ నగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు నిరుద్యోగ జేఏసీ నేత ఇంద్రా నాయక్. గత కొన్ని రోజులుగా నిరుద్యోగుల ఎక్కబడితే అక్కడ ఆందోళన చేస్తున్నారు..జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు అన్నారు.

నిన్న రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. CM రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ధర్నా చేస్తున్నారు… కాంగ్రెస్ నేతలకు నిరుద్యోగులు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తే ఒక్క కాంగ్రెస్ నేత స్పందించడం లేదు…ఎన్నికల మేనిఫెస్టో లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా..?వెంటనే 20 వేల పోలీస్ జాబ్ నోటిఫికేషన్ వేయాలి అని డిమాండ్ చేశారు.

Also Read:NHAI:’రాజ్‌మార్గ్‌యాత్ర’ యాప్ ద్వారా లోకల్ పాస్‌!

ఎక్కడ బడితే అక్కడ నిరుద్యోగులపై కేసులు పెడుతున్నారు ..రాహుల్ గాంధీకి , రేవంత్ రెడ్డికి తెలంగాణ నిరుద్యోగులు కనిపించడం లేదా..? ఇదేనా ప్రజాపాలన..తెలంగాణలో నిరుద్యోగుల పై పోలీసుల దాడి కనిపించడమంలేదా..?,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ ఒక రోజు నిరసన చేస్తే ..రాబోయే రోజు 24 న తెలంగాణ బంద్ పిలుపునిస్తున్నాం..24 న తెలంగాణ బంద్ అన్ని పార్టీలు మద్దతు తెలపాలి..కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కి నిరుద్యోగులు గుణపాఠం చెబుతారు అన్నారు.

- Advertisement -