భారత్ దిగుమతులపై ట్రంప్ టారీఫ్

1
- Advertisement -

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చోటుచేసుకున్న ఒక కీలక పరిణామంలో, వెట్టిచాకిరీ (చట్టవిరుద్ధ శ్రమ) ద్వారా ఉత్పత్తుల తయారీని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా భారత్ సహా 17 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10 శాతం సుంకాన్ని (టారిఫ్) విధించారు. గత నెలలో ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 ప్రకారం అమెరికా ప్రతిపాదించిన విధానంలో భారత్‌ను 12.5 శాతపు పన్ను పరిధిలో ఉంచినప్పటికీ దిగుమతిని నిషేధిస్తూ న్యూఢిల్లీ తన విదేశీ వాణిజ్య విధానంలో చేసిన సవరణలను వాషింగ్టన్ సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఇటువంటి నిషేధాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా ప్రోత్సహించేందుకు ఈ సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేసినట్లు అధ్యక్షుడు ట్రంప్ ఒక మెమోరాండంలో స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంలో భాగంగా యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) జేమీసన్ గ్రీర్ మొత్తం 60 దేశాలపై సెక్షన్ 301 కింద కొత్త సుంకాలను ప్రకటించారు. బలమైన చట్టాలు లేని చైనా, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్ వంటి 43 దేశాలు 12.5 శాతం సుంకాలను ఎదుర్కోనుండగా..భారత్, కెనడా, యూకే, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో సహా 17 దేశాలకు 10 శాతం పన్నును వర్తింపజేశారు.

Also Read:సోనమ్ దీక్ష విరమణపై అభిజిత్

అయితే దేశీయంగా కొరత ఏర్పడే ముడిసరుకులు, అమెరికాలో తగినంత పరిమాణంలో ఉత్పత్తి కానటువంటి ఉత్పత్తులకు ఈ పన్నుల నుండి మినహాయింపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు వాషింగ్టన్ ప్రకటించగా శుక్రవారం అర్ధరాత్రి 12:01 గంటల నుంచే ఈ నూతన టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి.

- Advertisement -