సీజేపీ నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో ఢిల్లీ పోలీసులు బహిరంగ ప్రకటన విడుదల చేశారు.శాంతిభద్రతలు కాపాడుతున్న పోలీసు సిబ్బందిపై దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు.
“యూనిఫాం ధరించినంత మాత్రాన నొప్పి తగ్గదు. ప్రతి పోలీసు వెనుక ఒక కుటుంబం, దేశానికి సేవ చేయాలనే బాధ్యత ఉంటుంది” అని పేర్కొన్నారు.విధి నిర్వహణలో ఉన్న అధికారులపై హింస జరగడం బాధాకరమని, హింసకు సమాజంలో ఎలాంటి స్థానం లేదన్నారు.
నిరసనల సందర్భంగా రాళ్లు రువ్వడం, పోలీసు వాహనాలు ధ్వంసం చేయడం వల్ల సీనియర్ అధికారులతో సహా 118 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు.
ఘటనలపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు 10 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు.చట్టాన్ని అమలు చేయడం, ప్రజల భద్రతను కాపాడడం తమ బాధ్యత అని, అదే సమయంలో శాంతియుత నిరసనలకు గౌరవం ఇస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

