తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

7
- Advertisement -

సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, గుణ, దామోహ్, డాల్టన్‌గంజ్, కాంటాయ్ గుండా ప్రయాణిస్తూ, అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశగా వంగి ఉంది.

నిన్న 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉన్న విండ్ షియర్ (పవన కోత) మరింత ఉత్తరం వైపుకు కదిలింది.

రాబోవు 3 రోజులకు వాతావరణ సూచన (FORECAST)
మొదటి రోజు (ఈరోజు): తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

రెండవ రోజు (రేపు): తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

మూడవ రోజు: తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (WARNINGS)
మొదటి రోజు (ఈరోజు): తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

రెండవ రోజు (రేపు): తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.

మూడవ రోజు: తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.

Also Read:పేపర్ లీక్‌లపై విపక్ష ఎంపీల ఆందోళన

- Advertisement -