సికేవైసీ (CKYC) వినియోగదారులకు 14 అంకెలతో కూడిన ఒక ప్రత్యేక నంబర్‌ను కేటాయిస్తుంది. దీని ద్వారా ఆర్థిక సంస్థలు సరిచూసిన (Verified) కేవైసీ రికార్డులను నేరుగా పొందే వీలుంటుంది. ఫలితంగా పదేపదే పేపర్‌వర్క్ మరియు వెరిఫికేషన్లు చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది.
సికేవైసీ (CKYC) ద్వారా ప్రతి వ్యక్తికి 14 అంకెల ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయించబడుతుంది.
ఈ విధానం వల్ల వేర్వేరు ఆర్థిక సంస్థల్లో పదేపదే కేవైసీ పత్రాలు సమర్పించే శ్రమ తప్పుతుంది.
ఒకసారి వెరిఫై అయిన కేవైసీ రికార్డులను వినియోగదారులు ఏ ఇతర ఆర్థిక సేవలకైనా తిరిగి వాడుకోవచ్చు.
భారతదేశంలో బ్యాంక్ ఖాతా తెరవాలన్నా లేదా పెట్టుబడులు పెట్టాలన్నా.. మీ ‘నో యువర్ కస్టమర్’ (KYC) పత్రాలను సమర్పించడం, వాటిని ప్రతిసారీ సరిచూసుకోవడం (Verification) తప్పనిసరి. ఈ సుదీర్ఘమైన ప్రక్రియను సులభతరం చేసేందుకు సెంట్రల్ నో యువర్ కస్టమర్ (CKYC) విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఈ విధానంలో కేటాయించే 14 అంకెల ప్రత్యేక నంబర్ మీ కేవైసీ రికార్డులతో అనుసంధానమై ఉంటుంది. ఈ డేటా అంతా సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ (CKYCR) లో సురక్షితంగా నిల్వ ఉంటుంది. వినియోగదారులు కేవలం ఒకే ఒక్కసారి తమ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు కొత్తగా ఏదైనా బ్యాంక్ ఖాతా తెరిచినా, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినా.. బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు నేరుగా మీ CKYC నంబర్ ఆధారంగా రికార్డులను పొందుతాయి. దీనివల్ల ప్రతిసారీ అదే పత్రాలను సమర్పించాల్సిన పని లేకుండా సమయం, శ్రమ ఆదా అవుతాయి.
సెంట్రల్ కేవైసీ వ్యవస్థలో మీ వివరాలు నమోదైన తర్వాత 14 అంకెలతో కూడిన ఒక ప్రత్యేక నంబర్ కేటాయించబడుతుంది. ఈ నంబర్ ద్వారా ఆర్‌బీఐ, సెబీ పరిధిలోని ఆర్థిక సంస్థలు వినియోగదారుల పాత కేవైసీ వివరాలను నేరుగా సేకరిస్తాయి. ప్రతిసారీ సుదీర్ఘమైన వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం లేకుండా ఇది ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు , మ్యూచువల్ ఫండ్ హౌస్‌లతో సహా అన్ని రకాల ఆర్థిక సేవల్లో ఈ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు.
Also Read:పేపర్ లీక్‌లపై విపక్ష ఎంపీల ఆందోళన
కొత్తగా ఆర్థిక సేవలు పొందే కస్టమర్ల ఆన్‌బోర్డింగ్ (Onboarding) ప్రక్రియను మరింత వేగవంతంగా, సులభంగా మార్చడమే CKYC ప్రధాన లక్ష్యం. గతంలో వేర్వేరు ఆర్థిక ఉత్పత్తుల కోసం ప్రతి సంస్థకు విడివిడిగా ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ పత్రాలను సమర్పించాల్సి వచ్చేది. CKYC ఈ ఇబ్బందిని తప్పించి, సెంట్రల్ రిజిస్ట్రీలో ఉన్న రికార్డులను రీ-యూజ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.
CKYC నంబర్ ను వినియోగదారులు తమ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు లేదా CKYC టోల్-ఫ్రీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వివరాలు పొందవచ్చు.

