విద్యార్థుల ఆందోళనలకు అలియా మద్దతు!

2
- Advertisement -

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు బాలీవుడ్ నటి అలియా భట్ మద్దతు పలికారు. ఈ పరిస్థితులపై ఆమె తన సోషల్ మీడియా వేదికగా విచారం, ఆశతో కూడిన ఒక భావోద్వేగ నోట్‌ను పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా పేపర్ లీకేజీల అంశంపై వందలాది మంది విద్యార్థులు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

సల్మాన్ ఖాన్ తర్వాత అలియా భట్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న విద్యార్థుల పోరాటంపై స్పందించారు. గడిచిన కొన్ని రోజులు నా హృదయాన్ని కలిచివేశాయి.. కానీ మళ్లీ కొత్త ఆశలతో నింపాయి. నిరసన తెలుపుతున్న ప్రతి విద్యార్థి వెనుక ఒక కల, ఒక కుటుంబ ఆశయం, ఎన్నో త్యాగాల ప్రయాణం దాగి ఉన్నాయి. వారు కేవలం తమ కోసం మాత్రమే కాకుండా, తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరి కోసం, అలాగే రాబోయే తరాల కోసం ఒక మంచి మార్గాన్ని సుగమం చేయడానికి పోరాడుతున్నారు అని ఆమె తెలిపారు.

వారి ధైర్యం నన్ను విస్తుపోయేలా చేస్తోంది. వారి పట్టుదల మనందరికీ ఒక హెచ్చరికలా నిలుస్తూ.. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే వారి మాటలను మనం నిజంగా వింటున్నామా? అని ప్రశ్నిస్తోంది. ఇది విద్యార్థుల కోసం.. విద్యార్థుల చేత జరుగుతున్న పోరాటం. భవిష్యత్తు వారిదే. జై హింద్ అని పేర్కొన్నారు.

- Advertisement -