వైభవ్‌పై శ్రేయాస్ ప్రశంసలు

2
- Advertisement -

జింబాబ్వేతో జరిగిన మొదటి T20I మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు.

అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మైదానంలో ఎంతో ధైర్యంగా ఆడే యువ ఆటగాడు. ఈ ఇన్నింగ్స్‌ను అతను సమీపించిన తీరు అద్భుతం. ఇదివరకు ఇక్కడ ఆడిన అనుభవం ఉండటంతో పిచ్ స్వభావంపై అతనికి మంచి అవగాహన ఉంది. అండర్-19 ఫైనల్లో అతను 175 పరుగులు చేశాడని అనుకుంటా, అందుకే గ్రౌండ్‌లోకి దిగగానే అతడిలో అపారమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఈ రోజది చూడటం చాలా సంతోషంగా ఉంది. సిరీస్‌కు ఇది మంచి ఆరంభం అని తెలిపారు శ్రేయాస్.

ఇది నిజంగా అద్భుతం. ఆటగాళ్లు తమ ప్రణాళికలను అమలు చేసిన తీరు బాగుంది. కెప్టెన్‌గా నా మొదటి విజయాన్ని నమోదు చేసుకోవడం కంటే సంతోషం మరొకటి ఉండదు. పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుందని నేను ముందే ఊహించాను, ముఖ్యంగా హార్డ్ లెంగ్త్ బంతులకు ఈ వికెట్‌పై అనుకున్నంత బౌన్స్ లభించింది అని పేర్కొన్నాడు.

Also Read:సోనమ్ దీక్ష విరమణపై అభిజిత్

తొలి T20I మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన టీమిండియా ప్పుడు రెండో మ్యాచ్‌పై దృష్టి సారించింది. హరారే వేదికగానే ఆగస్టు 25న జరగనున్న రెండో T20I లో గెలిచి, సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.

- Advertisement -