బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 17 హైలైట్స్

55
bb5

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 17 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. 17వ ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగగా మూడోవారం కెప్టెన్సీ టాస్క్‌ ఫన్నీగా సాగింది.

ఇక తాజా ఎపిసోడ్‌లో జెస్సీ….. నటరాజ్, మానస్‌లను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో జెస్సీ తీరును తప్పుబట్టారు నటరాజ్ మాస్టర్. నాకు తిక్క ఉంది.. తిక్కరేగితే లెక్కలు మారిపోతాయ్.. నువ్ నా ముందు చిన్నపిల్లోడివి.. జూజూ పక్కకి వెళ్లి ఆడుకోమ్మా అని మండిపడ్డారు. తర్వాత ప్రియను నామినేట్ చేస్తూ ఆమె ఎప్పుడూ తనని హర్ట్ చేస్తూనే ఉన్నారని.. తన శరీరంపై కట్స్ ఉంటే సర్జరీ చేయించుకున్నావా? అని నన్ను చాలా బాధపెట్టిందని తెలిపింది హామిదా. హమీదా ప్రియపై ఫైర్ కావడంతో రవితో పాటు మిగిలిన మెన్స్ చప్పట్లు కొడుతూ కనిపించారు.

మొత్తంగా మూడోవారంలో లహరి, ప్రియాంక, మానస్, శ్రీరామ్, ప్రియ ఐదురుగు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ ముగియగానే ప్రియ కన్నీటిపర్యంతమైంది. తన కళ్లతో చూసిన విషయాన్నే నేను చెప్పాను అని కంటతడిపెట్టేసింది. తర్వాత ప్రియ, లహరి, రవి ముగ్గురూ కూర్చున్నప్పుడు కూడా నువ్ అన్నావ్ కదా రవి.. అని ప్రియ అడగ్గా నేను అలా అనలేదు.. అసలు సింగిల్ మెన్ అనే పదాన్ని వాడలేదని ప్లేట్ తిప్పేశాడు. అయితే నువ్ అన్నావ్ బ్రో అని కన్నీళ్లు పెట్టుకుంది ప్రియ.

అయితే రవి మాత్రం నేను అనలేదని చెప్పడమే కాకుండా.. తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ప్రియ అని చెప్పిందని తనని బ్యాడ్ చేస్తుందని లహరి ముందు తెగ నటించాడు. తర్వాత ఉదయాన్నే ప్రియ వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు.. మిగిలిన లహరి, రవిలకు క్షమాపణ చెప్పింది. ఈ సందర్బంలో కెమెరా దగ్గరకు వెళ్లి నా భార్య నిత్యకి కూడా క్షమాపణ చెప్పమని కోరడంతో.. ప్రియ చెప్పడానికి నిరాకరించింది. అయితే ఏమైందో ఏమో కానీ ఆ తరువాత కెమెరా దగ్గరకు వచ్చి లహరి, రవి ఫ్యామిలీలకు సారీ చెప్పింది ప్రియ.

తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఫన్నీగా సాగింది. హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అల్లుడు టాస్క్‌లో కంటెస్టెంట్లు ఎంజాయ్ చేశారు. ఇందులో అమెరికా అబ్బాయిగా శ్రీరామ్, అతని తల్లిగా ప్రియా నటించగా, శ్రీరామ్ పీఏగా విశ్వ, స్నేహితుడిగా సన్ని నటించారు. కాజల్ అతని లవర్ గా నటించింది. ఇక లహరి హైదరాబాద్ కు చెందిన అమ్మాయి కాగా ఆమె తల్లిదండ్రులుగా యానీ, నటరాజ్ నటించారు. లహరి మతిమరుపు మామ పాత్రను రవి పోషించగా, పక్కింటి అబ్బాయిగా మానస్ చేశాడు. ఈ రెండు కుటుంబాలను కలిపే పెళ్ళిళ్ళ పేరయ్య పాత్రను షణ్ముఖ్ ప్లే చేయగా, పెళ్ళి ని జరిపించే ఈవెంట్ మేనేజర్ గా లోబో, అతని అసిస్టెంట్ గా శ్వేత వర్మ నటించారు.