అమెరికా పౌరులకు ట్రంప్ బంపర్ ఆఫర్

5
- Advertisement -

అమెరికా పౌరులకు ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. త్వరలో ఒక్కొక్కరికి 2 వేల డాలర్లు ఇస్తామని ప్రకటించారు. సంపన్నులు మినహా అందరికీ 2 వేల డాలర్లు ఇస్తామని తెలిపారు. భారత్ సహా పలు దేశాలపై భారీగా పన్నులు విధించారు ట్రంప్. దీనిని ఆ దేశ పౌరులకు పంచాలని నిర్ణయించారు.

తన టారిఫ్ విధానంపై సుప్రీం కోర్టులో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో, పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించి, అమెరికా జాతీయ రుణాన్ని తీర్చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకు ఇవ్వబోము అని తెలిపిన ట్రంప్… ఎలాంటి ఆదాయ స్థాయి ఉన్నవారు అర్హులు కారు అన్న వివరాలు ఆయన వెల్లడించలేదు.

టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు మూర్ఖులు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో రాశారు. ఇప్పుడు మేము ప్రపంచంలో అత్యంత ధనిక, అత్యంత గౌరవనీయమైన దేశం, దాదాపు ఎలాంటి ద్రవ్యోల్బణం లేకుండా, చరిత్రలోనే అత్యధిక స్టాక్ మార్కెట్ స్థాయితో ఉన్నాము. 401(k) ఖాతాలు కూడా ఇప్పటివరకు ఉన్న అత్యధిక స్థాయిలో ఉన్నాయి అన్నారు.

అమెరికాలో రికార్డు స్థాయి పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ప్రతిచోటా నిర్మాణంలో ఉన్నాయి. ప్రతి వ్యక్తికి (అధిక ఆదాయం ఉన్నవారిని మినహాయించి) కనీసం $2000 డివిడెండ్ ఇవ్వబడుతుంది అని వెల్లడించారు.

Also Read:ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

- Advertisement -