ఇకపై అడగ్గానే విడాకులు

52
- Advertisement -

దేశంలో విడాకుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో విడాకులను వెంటనే మంజూరు చేయవచ్చంటూ వెల్లడించింది. గతంలో కొన్ని షరతులతో ఆరు నెలలపాటు నిరీక్షించాలన్న నిబంధనను సడలించవచ్చంటూ జస్టిస్‌ ఎస్కే కౌల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై 2016 జూన్‌లో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది.

కలిసి జీవించలేని స్థితిలో వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని తెలిపింది. భార్యాభర్తల పరస్పర అంగీకారం ఉంటే చాలు…వివాహబంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైతే పెండ్లి రద్దుకు 6 నెలల నిరీక్షణ అవసరం లేదని తెలిపింది. ఆర్టికల్‌-142 కింద కోర్టుకు విస్తృత అధికారాలున్నాయని వెల్లడించింది. అయితే ఈ తీర్పుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి భారత్‌లో విడాకులు తీసుకునే వారి సంఖ్య కేవలం 1 శాతం మాత్రమే. చైనాలో 44 శాతం,అమెరికాలో 45 శాతం,స్పెయిన్‌లో 85 శాతం, పోర్చుగల్‌లో 94 శాతం ఉన్నారు.

దీనిపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. భారతీయ ఆత్మను అంతం చేయడమే ద్యేయం అన్నారు. ఆస్తితగాదాలు,అప్పుల ఎగవేతలు,ఆర్ధిక నేరాలు వేరు కానీ అదే “వివాహబంధ” వ్యవహారాలు అందుకు పూర్తిగా భిన్నం..ఒక్క జంటలోని “విడాకులు”, ఆ ఒక్క జంటపైనే కాకుండా వారి సంబందికులైన ఎందరెందరో వ్యక్తులపై అది ప్రత్యక్ష/పరోక్ష ప్రభావం తప్పకుండా చూపుతుంది.

Also Read:IPL 2023:కోహ్లీ గంభీర్ మద్య గొడవ.. ఇప్పట్లో తగ్గదా?

అదొక రకంగా ఆఁ కుటుంబం మొత్తాన్ని ఒక్క కుదుపు కుదుపుతుంది కనుక సాధ్యమైనంత మట్టుకు…”విడాకులు” ఇవ్వడానికి కొంత జాప్యం చేస్తే,అలా వాళ్ళ ఉద్దేశ్యాన్ని కొంత నిరుత్సాహపరిస్తే…ఆఁ కొంత సమయంలో మనసు మారే అవకాశాలు పుష్కలం…ఎందుకంటే “సమయం”…మనుషుల్లో…ఆలోచనల్ని…అభిప్రాయాల్ని…ఆసాంతం మారుస్తుంది…ఎన్నో మార్పులు తెస్తుంది…అందుకే…”విడాకులు” విషయంలో…6 నెలల “Waiting Period/వేచిచూసే వ్యవధి” అనే ఒక నిబంధనను పెట్టడం జరిగింది. నిజానికి విడాకులు కోరుతూ కోర్టు వరకొచ్చి జంటల్లో ఆఁ తరువాత అందులో ఒక 45% మంది వరకు మళ్ళీ మనసు మార్చుకొని, తమ వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నారు.

గతంలో “అక్రమసంబంధం/Adultery”లో సదరు మహిళ భర్త గనుక ఫిర్యాదు చేస్తే, ఆఁ మహిళతో అక్రమసంబంధం నెరుపుతున్న మగాడిని శిక్షించే “భారతీయ నేరస్మృతి/Indian Penal Code”లోని సెక్షన్ 497 ను ఇదే సుప్రీం కోర్టు ఒక 3/4 సంవత్సరాల కింద కొట్టేసింది. నిజానికి “Indian Law Commission”తో పాటు మరెన్నో బాధ్యతగల పౌర సంఘాలు IPC 497లో ఒక్క మగాడిని మాత్రమే కాకుండా… అందుకు సమాన బాధ్యురాలైన స్త్రీకి కూడా శిక్ష వుండాలని కోరితే, ఘనమైన మన గౌరవ సుప్రీంకోర్టు మగాడికి విధించే శిక్షను కూడా తొలగించి అసలు మొత్తం IPC లోని 497 సెక్షన్నే తొలగించి, పరోక్షంగా “అక్రమ సంబంధం”కు చట్టబద్దతనిచ్చింది.

Also Read:బ్రదర్స్ & సిస్టర్స్ డే

ఇకలాగే “Living Together” అనే మరో పెడరస ధోరణికి వంతపాడటం గమనార్హం. ఇలా ఒకవైపు తన పెడదోరణులతో మొత్తం “భారతీయ కుటుంబ వ్యవస్థ”నే అస్తవ్యస్తం చేస్తూనే మరోవైపు హిందూ ఆచారవ్యవహారాల్లో కూడా వేలుపెడుతూ “భారతీయ సనాతన ధర్మం”పై ప్రత్యక్ష యుద్ధంకు పాల్పడుతున్నది. అందుకు ఉదాహరణ శబరిమలై మరియు శనిసింగణాపురం ఆలయాల్లోకి మహిళకు ప్రవేశం కల్పించాలని తీర్పివ్వడం. ఇక ఇలా తీర్పులిచ్చే జడ్జీల్లో మెజారిటీ వాళ్ళు మిషినరీ/కాన్వెంట్ స్కూల్లల్లో చదివినవాళ్ళు లేదా కమ్యూనిస్ట్ సిద్దాంతంగల కుటుంబాల నుండి వచ్చిన వారే వుండడం గమనార్హం. అలాగే కేవలం హక్కులు… సుఖాలు… విశ్రుంఖలతలునే తప్ప వ్యక్తి పట్ల… వ్యవస్థ పట్ల బాధ్యతలేని ఆచారవ్యవహారాల్ని కల్గుండే పాశ్చాత్యసమాజంకు పూర్తిగా భిన్నమైన మన భారతీయసమాజంపై రుద్దే ప్రయత్నం గర్హనీయం అనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -