సుప్రీంకోర్టులో ముగిసిన పార్టీ పిరాయింపుల కేసు విచారణ వాదనలు ముగిశాయి. ఫిరాయింపుల కేసులో తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు బీఆర్ఎస్ తరపు అడ్వకేట్ ఆర్యమా సుందరం.
ఇక కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు స్పీకర్,అసెంబ్లీ కార్యదర్శి తీరును తప్పుబట్టింది. స్పీకర్ చర్య తీసుకోకపోతే.. 4 సంవత్సరాలు స్పీకర్ ఏమీ చేయకపోతే, కోర్టు చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా ? అని ప్రశ్నించారు జస్టిస్ బి ఆర్ గవాయ్.సుప్రీంకోర్టు లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరుగగా జస్టిస్ బి ఆర్ గవాయ్,జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం వాదనలు వింది.
స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి సహా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు వాదనలు వినిపించారు రోహిత్గి. ఈ సందర్భంగా స్పీకర్ కి సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ణప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ప్రశ్నించారు జస్టిస్ బి ఆర్ గవాయ్.
స్పీకర్ చర్య తీసుకోకపోతే.. 4 సంవత్సరాలు స్పీకర్ ఏమీ చేయకపోతే, కోర్టు చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా ?, పార్టీ ఫిరాయింపుల నోటీసు జారీ చేయడానికి స్పీకర్ 11 నెలలు సమయం తీసుకున్నారు.. అది కూడా సుప్రింకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చారు అన్నారు. గత విచారణలో బీఆర్ఎస్ వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే.
Also Read:HCU భూములపై సుప్రీంలో విచారణ

