వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా?:హరీష్

19
- Advertisement -

బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.హెచ్ సి యూ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు, బి ఆర్ ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు బనాయించారు అన్నారు.

నేడు నల్లగొండ జిల్లా, మర్తినేని గూడెం మాజీ సర్పంచ్ బండమీది రామును అక్రమంగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.. ఇలా ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ రెడ్డి గారు?, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా?.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? చెప్పాలన్నారు.

అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాం, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయించేదాకా బిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు.. ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం. ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం అని స్పష్టం చేశారు.

Also Read:హైదరాబాద్, రంగారెడ్డి నేతలతో కేసీఆర్‌ సమావేశం

- Advertisement -