సీఎం రేవంత్ రెడ్డిని మూగ జీవాలు కూడా క్షమించవన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏప్రిల్ 27 న వరంగల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో హరీశ్‌రావు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్… పాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని విమర్శించారు. హైడ్రా పేరుతొ పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండు, భూముల అమ్మకాల పేరుతో మూగ జీవాల గోస పోసుకున్నాడు. చివరకు మూగ జీవాలు కూడా రేవంత్ రెడ్డిని క్షమించవు అని దుయ్యబట్టారు.
నాడు 2001లో సిద్దిపేట కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం.. సిద్దిపేట ప్రజల ఆశీస్సులు తీసుకోని కేసీఆర్ గులాబీ జెండా ఎగరేశారని గుర్తు చేశారు. సిద్దిపేట వాళ్ళు లేని బహిరంగ సభ లేదు.. ఎక్కడ సభ అయినా.. ఎక్కడ ఎన్నికలు అయిన ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు సిద్దిపేట నాయకులు పని చేశారని హరీశ్‌రావు తెలిపారు.
సిద్దిపేట కీర్తిని మరో సారి చాటి చెప్పాలి. విద్యార్థి యువత ఆధ్వర్యంలో వెయ్యి మందితో పాదయాత్ర, 100 ట్రాక్టర్‌లతో ర్యాలీ నిర్వహించాలి. 27న పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పల్లెలో, పట్టణంలో గులాబీ జెండా ఎగరేయాలి అని పిలుపునిచ్చారు.
Also Read:వక్ఫ్ బిల్లు ఆమోదం చారిత్రాత్మకం:పవన్

