గుండెపోటుకు గురైన కాంగ్రెస్ నేత ప్రాణాలు కాపాడారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. సీతారాముల కల్యాణ ఏర్పాట్లపై ఆర్డీవో కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం సీనియర్ నాయకులు రసూల్ ఇంటికి వెళ్లారు. వీరి వెంట వెళ్లిన సీనియర్ నేత తోటమళ్ల సుధాకర్ అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండెలో నొప్పి అంటూ పడిపోయారు. తెల్లం వెంకట్రావు డాక్టర్ కావడంతో వెంటనే సీపీఆర్ చేసి సుధాకర్ ప్రాణాలు కాపాడారు.
సీపీఆర్ చేసిన తర్వాత అక్కడున్న ఇతర నాయకులు సుధాకర్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఎమ్మెల్యే దేవుడిలా ఎమ్మెల్యే తక్షణం సీపీఆర్ చేసి రక్షించారని నాయకులు తెలిపారు.
Also Read:వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా?:హరీష్

