సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

15
- Advertisement -

కంచ గచ్చిబౌలి HCU భూముల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి స్థలాల్లో ఎలాంటి పనులు చేపట్టరాదు అని తేల్చిచెప్పింది. వెంటనే పనులన్నీ ఆపేయాలి.. హైకోర్ట్ రిజిస్టర్ ఇచ్చిన నివేదికలో చాలా కీలక అంశాలు ఉన్నాయి అన్నారు.

ప్రభుత్వం నెల రోజుల్లో నిపుణుల కమిటీ వెయ్యాలి.. 6 నెలలోపు కమిటీ నివేదిక ఇవ్వాలి అన్నారు. ఫారెస్ట్ ను నాశనం చేసే ఆక్టివిటీ జరుగుతోంది.. చెట్లు.. నెమళ్ళు.. పక్షులు.. వన్య ప్రాణులు ఉన్నాయి అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు.

1. అంత అత్యవసరంగా అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది – అటవీ ప్రాంతంలో చెట్లను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది?

2. పర్యావరణ ప్రభావ సర్టిఫికెట్ తీసుకున్నారా?.

3. ఫారెస్ట్ విభాగం నుంచి అనుమతులు తీసుకున్నారా?

సీఎస్ పూర్తి బాధ్యత వహించాలి అన్నారు.

Also Read:మ్యాడ్ స్క్వేర్..ఎన్టీఆర్ వస్తున్నాడు!

- Advertisement -