అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లండన్ కోర్టు భారీ షాక్ విధించింది. 2017లో ట్రంప్‌కు వ్యతిరేకంగా సంచలన పత్రం విడుదల చేసింది. యూకేకు చెందిన ఓ మాజీ గూఢచారిపై దావా వేసేందుకు యత్నించారని ట్రంప్‌కు లండన్ హైకోర్టు జరిమానా విధించింది.
ఆరోపణలు నిరూపించడంలో విఫలమైనందుకు గాను న్యాయ ఖర్చుల కింద ట్రంప్ 7,41,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు ₹6 కోట్లు) చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పును వెలువరించింది.
యూకే సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎంఐ6 మాజీ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ ట్రంప్‌పై 2017లో ఒక సంచలన పత్రాన్ని విడుదల చేశారు. ఆ డాక్యుమెంట్లో ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా ఏజెంట్లతో ట్రంప్ రాజీపడ్డారని తెలిపారు. 2013లో ట్రంప్ మాస్కో పర్యటనకు సంబంధించి యూకే మాజీ గుఢచారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీంతో క్రిస్టోఫర్‌పై లండన్ కోర్టులో ట్రంప్ దావా వేశారు. అయితే ఆరోపణలు నిరూపించడంలో విఫలం కావడంతో భారీ జరిమానా విధించింది.
Also Read:రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏది?:ప్రవీణ్ కుమార్

