IPL 2023:కోహ్లీ గంభీర్ మద్య గొడవ.. ఇప్పట్లో తగ్గదా?

27
- Advertisement -

ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఎప్పుడు ప్రత్యేకంగానే నిలుస్తారు. 2011 వరల్డ్ కప్ లో చివరి మ్యాచ్ శ్రీలంకపై గెలవడంలో గంభీర్ కృషి ఎంతో ఉంది. టీమిండియాలో కోహ్లీ కంటే గంభీర్ సీనియర్.. ఈ ఇద్దరు కలిసి 2009లో శ్రీలంకపై జరిగిన వన్డే మ్యాచ్ లో 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇన్నింగ్స్ తోనే కోహ్లీ తన కెరియర్ లోనే మొట్టమొదటి సెంచరీ అందుకున్నాడు. ఇదిలా ఉంచితే గంభీర్, కోహ్లీ మద్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనెంతలా ఈ మద్య వివాదం కొనసాగుతోంది. 2013 ఐపీఎల్ లో మొదలైన వీరిద్దరి మద్య వివాదం ఇప్పటికీ కూడా తారస్థాయిలో కొనసాగుతోంది. .

2013 లో రాయల్ ఛాలెంజర్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మద్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఔట్ అయిన తరువాత పెవిలియన్ చేరుతున్న క్రమంలో గౌతి కోహ్లీని ఏదో అనడం, కోహ్లీ కూడా గౌతి పట్ల సీరియస్ కావడంతో ఇద్దరి మద్య మాట మాట పెరిగే ఏకంగా ఒకరినొకరు చేయి చేసుకునే వరకు గొడవ జరిగింది. ఇక అప్పటి నుంచి ఇద్దరి మద్య తరచూ ఏదో ఒక సందర్భంలో రగడ జరుగుతూనే ఉంది. ఇక తాజాగా మరోసారి వీరిద్దరి మద్య రగడ తారస్థాయికి చేరింది. లక్నో సూపర్ జెయింట్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మద్య జరిగిన నిన్నటి మ్యాచ్ లో లక్నో పై బెంగళూరు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని లక్నో ముందు ఉంచింది. అయితే ఆ స్వల్ప లక్ష్యం కూడా చేధించలేక లక్నో చేతులెత్తేసింది. నిర్ణీత ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ గా నిలిచింది.

Also Read:ఈ చిట్కాలు పాటిస్తే.. ఆ సమస్యలన్నీ దూరం !

దీంతో లక్నో పై బెంగళూరు విజయభావుట ఎగరవేసింది. ఇదిలా ఉంచితే లక్నో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ జట్టుకు మెంటర్ గా ఉన్న గంభీర్ మరియు కింగ్ కోహ్లీ మద్య 17 వ ఓవర్ వద్ద తారస్థాయిలో గొడవ పడ్డారు. ఒకరినొకరు తీవ్రమైన పదజాలలతో మాటల దాడి చేసుకుంటూ ఘర్షణ వాతావరణాన్ని తలపించేలా గొడవపడ్డారు. దీంతో వీరిద్దరి మద్య గొడవలు ఇంకా తగ్గలేదని స్పష్టంగా అర్థమౌతోంది. వీరిద్దమరి మద్య స్నేహం బంధం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది ఎప్పటికీ జరుగుతుందో చూడాలి. ఇక నేటి ఐపీఎల్ మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30 నిముషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ ను డిల్లీ ఎంతవరకు కట్టడి చేస్తుందో చూడాలి.

Also Read:టమాటాతో హార్ట్ ఎటాక్ దూరం !

- Advertisement -