సీతారాం ఏచూరితో భేటీ అయిన కవిత..

29
- Advertisement -

దేశవ్యాప్తంగా మహిళాలకు రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ఒకరోజు నిరహారదీక్షకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని ఆహ్వానించారు. రేపు జరగబోయే దీక్షకు ఢిల్లీ పోలీసులు షరతులతో కూడిన అనుమతినిస్తూ ఎమ్మెల్సీకి కవితకు పలు సూచనలు జారీచేశారు. ఈ దీక్షకు 10వేల మంది వస్తారని అందుకోసం తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని…కానీ ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద సగం స్థలం మాత్రమే ఉపయోగించుకోవాలిని పోలీసులు సూచిస్తున్నారని ఇది ఖచ్చితంగా మహిళలోకంకు జరుగుతున్న అన్యాయమని కవిత అన్నారు.

సీతారాం ఏచూరిని రేపటి దీక్షకు ఆహ్వానించాం. మహిళ బిల్లు ఆవశ్యకతపై చర్చించడం జరిగింది. 1996లో అప్పటి ప్రధాని దేవగౌడ మహిళ రిజర్వేషన్‌ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. అయితే ప్రతసారి ఎదొక సందర్భంలో ఈ బిల్లు తేవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు…కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం ఈబిల్లును తేవడానికి సిద్దంగా లేరని అందుకే ఈ దీక్ష చేపడుతున్నట్టు కవిత తెలిపారు. రేపటి దీక్షకు దేశవ్యాప్తంగా ఉన్న 18పార్టీల నుంచి సంఘీభావం తెలపనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత ప్రధాని ఈబిల్లును తేస్తే ప్రతిపక్షాలు అన్ని కలిసి చర్చించేందుకుసిద్ధంగా ఉన్నామన్నారు.

జీఎస్టీ ట్రిపుల్ తలాక్ బిల్లు సిటిజన్ షిఫ్ అమెండ్‌మెంట్ బిల్లు లాంటి ప్రతిష్టాత్మకమైన బిల్లులు తెచ్చిన మోదీ మహిళ రిజర్వేషన్ బిల్లును ఎందుకు తీసుకురావడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించింది. అయితే ఈ బిల్లు ప్రజాస్వామ్య దేశానికి ఇది ఎంతోముఖ్యమైనదని తెలిపింది. చిత్తశుద్ది ఉంటే ఈబిల్లు పార్లమెంట్‌లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా తెలిపింది. బిల్లు తెచ్చి చిత్తశుద్ధిని చాటుకోవాలని బిజేపిని కోరుతున్నాం. మహిళ రిజర్వేషన్ కోసం పోరాడేందుకు మార్చి 2న ధర్నా తేదీని ప్రకటించాను. కానీ మార్చి 7వ తేదీన నాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. దీన్ని అంతర్యం ఏమిటి అని ప్రశ్నించింది. ఈ బిల్లుకు కోసం పోరాడుతుంటే బీజేపీ వాళ్లు నన్ను అడ్డుకుంటున్నారు.

ఈడీ విచారణకు నేను మార్చి 11న వస్తా అని చెప్పాను. నాకు ధైర్యం ఉంది ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమని…కానీ ఎమ్మెల్యేల ఎర కేసులో మాత్రము బీఎల్ సంతోష్‌ ఎందుకు సిట్‌ ముందుకు రాలేకపోతున్నారని ప్రశ్నించారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న వ్యక్తులు నామీద మాట్లాడితే ఎలా? వెళ్లాల్సిన సమయంలో న్యాయస్థానాలకు హాజరవుతాం అని అన్నారు. మంత్రి కేటీఆర్ అన్నట్టు ఇది ఈడీ నోటీసు కాదు మోదీ నోటీసు అని కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి…

ఫైటర్ ఆఫ్ డాటర్ నెవర్ ఫియర్…

జెనిసిస్ అండ్‌ ఎవల్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్‌ పుస్తకావిష్కరణ…

ఆడబిడ్డపై నోటీసులా..ఆక్రమం…

 

- Advertisement -