ఫైటర్ ఆఫ్ డాటర్ నెవర్ ఫియర్…

23
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన నగర కూడళ్లలో ఆమెకు మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం కేసీఆర్ డాటర్‌గా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నేతపై అక్రమంగా ఈడీ కేసులు వేయడాన్ని తప్పపడుతూ నగర కూడళ్లలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల్లో ఫైటర్ ఆఫ్ డాటర్ నెవర్ ఫియర్‌, సేవ్ ఇండియా ఫ్రం బీజేపీ, విఆర్ విత్ కవితక్క అని పోస్టర్‌లు వెలిశాయి. వీటిని బీఆర్ఎస్ పార్టీ నేత అలిశెట్టి అరవింద్‌ ఏర్పాటు చేశారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ వ్యవస్థలను బ్రష్టూ పటిస్తూ దేశం తిరోగమనంలో ప్రయాణిస్తున్న వేళ దేశాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావడం చూసి ఓర్వలేక ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దేశ భవిష్యుత్తు కోసం జరుగుతున్న ఈ ధర్మయుద్ధంలో బీఆర్ఎస్‌దే అంతిమ విజయమని అన్నారు.

ఇవి కూడా చదవండి…

జెనిసిస్ అండ్‌ ఎవల్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్‌ పుస్తకావిష్కరణ…

ఆడబిడ్డపై నోటీసులా..ఆక్రమం…

కాంగ్రెస్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

- Advertisement -