అజిత్ మూవీ రైట్ భారీ రేటుకి?

5
- Advertisement -

స్టార్ హీరో అజిత్ కుమార్‌తో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే హైదరాబాద్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా 2025 సంక్రాంతికి విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటిటి డీల్ సెట్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్‌ని సొంతం చేసుకోగా ఇందుకోసం ఏకంగా 95 కోట్లు ఆఫర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:సైక్లింగ్ చేయడం మంచిదేనా?

- Advertisement -