MLC Kavitha:ఇటలీ రాణి సోనియాగాంధీ..

45
- Advertisement -

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలపై మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. సోనియా గాంధీ దేవత కాదు బలిదేవత అన్నారు. తనని క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు మీ ఇటలీ రాణిని బలిదేవత అని పిలవాలన్నారు. దిగజారిపోయి హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నాను అని మండిపడ్డారు.

మెట్‌ప‌ల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. తెలంగాణతో రాహుల్ గాంధీ కుటుంబానికి నమ్మకద్రోహపు అనుబంధం ఉన్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చావు నోట్లో తల పెడితే 2009లో తెలంగాణ ఏర్పాటును ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకుంటే వందలాదిమంది బిడ్డల చావులకు సోనియాగాంధీ కారణమయ్యారని అన్నారు. తెలంగాణ కోసం పార్లమెంటులో సహకారంగా ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ మాట్లాడలేదని క‌విత పేర్కొన్నారు.

పార్లమెంటులో సోనియాగాంధీ ఆంధ్రకు రావలసిన హక్కుల గురించి మాట్లాడారు కానీ తెలంగాణ హక్కుల పై మాత్రం మాట్లాడలేదని క‌విత‌ ఎండగట్టారు.తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఆనాడు దీక్ష చేశారు. ఆంధ్ర సొమ్ములతో ఉద్యమ సమయంలో జరిగిన ఎన్నికల్లో మద్యం, డబ్బులను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విచ్చలవిడిగా పంపిణీ చేయించారు. రైతులకు, కార్మికులకు ఆ ప్రైవేట్ యాజమాన్యం బకాయిలు ఎగ్గొట్టిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 66 కోట్లు చెల్లించిందని, ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి 2015 లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, దాంతో చెప్పా పెట్టకుండా ఆ బీజేపీ నాయకుడు లాకౌట్ ప్రకటించారని వివరించారు.

Also Read:శ్రీలీల – కాజల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

- Advertisement -