ప్రజలకు పంగనామం పెట్టిన కాంగ్రెస్:కిషన్ రెడ్డి

8
- Advertisement -

దేవుళ్లపై ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పంగనామం పెట్టిందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని.. చాలా తక్కువ మంది మాత్రమే సన్న వడ్లు పండిస్తారని కిషన్‌ రెడ్డి తెలిపారు

హామీలను నెరవేర్చడంలో రేవంత్‌ రెడ్డి సర్కార్‌ విఫలమయ్యిందని..దేవుళ్లపై ఒట్ల పేరుతో ప్రజలకు కాంగ్రెస్‌ పంగనామం పెట్టిందని విమర్శించారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఏమైందని ప్రశ్నించారు. డిసెంబర్‌ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్‌.. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటున్నారని సీరియస్‌ అయ్యారు.

దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. దొడ్డు వడ్లను కొనేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వర్షాలకు ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. నిన్న 75వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని.. ఇలాగే కొనసాగితే మొత్తం ధాన్యం కొనేందుకు రెండు నెలల సమయం పడుతుందని మండిపడ్డారు.

Also Read:KTR:చేసింది చెప్పుకోలేకే ఓటమి?

- Advertisement -