విజయ్‌ సేతుపతితో ఆర్జీవీ..మూవీ కోసమేనా!

7
- Advertisement -

వైవిధ్యమైన, వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ ఆర్జీవీ. సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్‌కే ప్రాధాన్యతనిచ్చే ఆర్జీవీ తాజాగా చెన్నైలో ప్రత్యక్ష మయ్యారు. స్టార్ హీరో విజయ్ సేతుపతితో భేటీ అయ్యారు వర్మ.

విజయ్ సేతుపతిని ఆయన ఆఫీస్‌లో కలిసిన ఆర్జీవీ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. విజయ్ సేతుపతిని చాలా సార్లు స్క్రీన్ మీద చూసిన తర్వాత, ఇప్పుడు నిజంగా ఇతన్ని కలిసాక స్క్రీన్ మీద కంటే బయటే చాలా బాగున్నాడు అని తెలిపారు.

విజయ్ సేతుపతి – ఆర్జీవీ భేటీ వార్తతో వీరిద్దరి మధ్య సినిమా ఉంటుందా అనే గాసిప్ చక్కర్లు కొడుతోంది.

Also Read:Pushpa 2:సెకండ్ సాంగ్ అదిరే న్యూస్!

- Advertisement -