TSRTC కాదు TGRTC!

25
- Advertisement -

తెలంగాణ ఆర్టీసీ పేరు మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ పేరును TGRTCగా మారుస్తు నిర్ణయం తీసుకుంది. ఇటీవలె ప్రభుత్వం టీఎస్‌ స్థానంలో టీజీగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్‌ హెడ్‌లపై టీఎస్‌కి బదులు టీజీగా పేర్కొనాలని ఆదేశించింది.మొదటగా మార్చిలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి టీఎస్‌ తొలగించి టీజీగా మార్చింది.

ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మార్పులు చేయగా.. తాజాగా ఆర్టీసీ సైతం టీజీఎస్‌ ఆర్టీసీగా మార్పులు చేసింది. సంస్థ ఎండీ సజ్జనార్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్చడం జరిగిందని.. ఈ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాలు @tgsrtcmdoffice, @tgsrtchq గా మార్చినట్లు పేర్కొన్నారు.

Also Read:ఓజీ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది!

- Advertisement -