జైలు అధికారుపై చర్యలు తీసుకోండి:కవిత

14
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జైలులో తనకు అందుతున్న చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు కవిత.

తీహార్ జైలు అధికారులు త‌న‌ హక్కులకు భంగం కలిగిస్తున్నారని, కోర్టు ఆదేశాలేవీ పాటంచడం లేదని క‌విత వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేశారు. జైలు అధికారులు తనని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని… క‌నీస గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేదన్నారు.

కోర్టు ఆదేశాల‌ను ఏమాత్రం పాటించడం లేదని… త‌న‌కు ఇంటి భోజ‌నం, పరుపు, చెప్పులు, దుస్తులు, బెడ్ షీట్స్‌, బుక్స్‌, క‌ళ్ల‌జోడు, మందులు ఇవ్వాల‌ని ఆదేశించిన పట్టించుకోవడం లేదన్నారు. క‌నీసం క‌ళ్ళ‌జోడు కూడా ఇవ్వ‌లేదు. పెన్ను… పేప‌ర్లు అడిగితే.. నీకెందుకంటూ.. అగౌర‌వంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు కవిత. త‌న‌ను అగౌర‌వ ప‌రిచిన జైలు అధికారుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టును కోరారు.

Also Read:బీఆర్ఎస్‌ను వీడను:మాలోతు కవిత

- Advertisement -