Thandel:చైతూ లుక్ అదుర్స్

12
- Advertisement -

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్ర తండేల్. చైతూ కెరీర్‌లో ఇది 23వ సినిమా కాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించనున్నారు.

రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ సినిమాలో చైతూ ఫిషర్ మెన్‌గా కనిపించనుండగా ఫిషర్‌మెన్‌ అవతార్‌లో పడవపై నిలబడి తాడు చుడుతున్న లుక్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. చైతూను ఇదివరకెన్నడూ కనిపించని విధంగా సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నట్టు తాజా స్టిల్ చెప్పకనే చెబుతోంది. 2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్‌ తెరకెక్కుతోంది.

- Advertisement -