నేటి పెట్రోల్,డీజీల్ ధరలు..

17
petrol price

కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న చమురు ధరలకు బ్రేక్ పడింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆదివారం ఎలాంటి మార్పు చేయలేదు ఆయిల్ కంపెనీలు. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.83.49గా ఉండగా డీజిల్ ధర కూడా రూ.80.14 వద్ద స్థిరంగానే కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర రూ.80.43గా ఉండగా డీజిల్ ధర కూడా స్థిరంగా రూ.73.56 వద్ద ఉందన్నారు. ముంబైలో పెట్రోల్ ధర రూ.87.19గా ఉండగా డీజిల్ ధర రూ.80.11 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌‌కు 0.90 శాతం పెరుగుదలతో 43.64 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.30 శాతం పెరుగుదలతో 40.44 డాలర్లకు ఎగసింది.