మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..

71
petrol

5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నెలలో 15 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ పెట్రోల్ పై 23 పైసలు,డీజీల్‌పై 30 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 93.68 చేరగా, లీటర్ డీజిల్ ధర రూ. 84.61 గా ఉంది.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.77కి చేరగా,డీజిల్ ధర రూ. 93.07 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.36 చేరగా.. డీజిల్ ధర రూ. 92.24 కు చేరింది. ఇక ఏపీలో ఇప్పటికే పలుచోట్ల పెట్రోల్ ధర సెంచరీ మార్క్ దాటేశాయి.