క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో!

80
- Advertisement -

క్యారెట్ గురించి మనందరికీ బాగా తెలుసు. దీనిని కూరగానే కాకుండా పచ్చిగా కూడా తింటూ ఉంటారు చాలామంది. దీనిని ప్రతిరోజూ తినడం వల్ల చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మన శరీరానికి అవసరమైన అని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఒకటి లేదా రెండు క్యారెట్లు తినాలని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే క్యారెట్ ను తినడానికి ఇష్టపడని వారు జ్యూస్ రూపంలో తయారు చేసుకొని సేవించిన మంచిదేనని చెబుతున్నారు నిపుణులు. క్యారెట్ ను జ్యూస్ చేసుకొని ప్రతిరోజూ ఒక గ్లాస్ చొప్పున తాగితే చర్మం సౌందర్యవంతంగా మారుతుంది. ఇందులో విటమిన్ ఏ, సి కె వంటివి అధిక మొత్తంలో లభిస్తాయి. అందువల్ల కంటి సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, రక్త హీనత వంటివి పూర్తిగా దూరమౌతాయట.

ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తద్వారా సీజనల్ గా వేధించే వ్యాధులను కూడా ఎదుర్కోవచ్చని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయట. ఇంకా కాలేయ సంరక్షణకు కూడా క్యారెట్ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుందట. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ, కెరోటినాయిడ్స్, వంటివి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్ బారిన పడకుండా కాలేయ పనితీరును మెరుగు పరుస్తాయట. అంతే కాకుండా మెదడు పనితీరును మెరుగు పరిచి రోజంతా చురుగ్గా ఉండేందుకు క్యారెట్ జ్యూస్ ఉపయోగ పడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే క్యారెట్ జ్యూస్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే అమితంగా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అజీర్తి, వాంతులు ఏర్పడే ప్రమాదం ఉందట.

Also Read:Supreme:పోస్టల్ బ్యాలెట్ ప్రసక్తేలేదు

- Advertisement -