దేశంలో కరోనాతో 37,364 మంది మృతి

90
coronavirus cases

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 54,736 పాజిటివ్ కేసులు నమోదుకాగా 853 మంది మృతిచెందారు. ఒకరోజులో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి.

ఓవరాల్‌గా దేశంలో కరోనా కేసుల సంఖ్య 17,50,724కి చేరగా ప్రస్తుతం 5,67,730 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారి నుండి 11,45,630 మంది కోలుకున్నారు.

ఇప్పటివరకు కరోనాతో 37,364 మంది మృతిచెందగా దేశంలో గ‌త మూడు రోజులుగా ప్ర‌తిరోజూ అర ల‌క్ష‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి.భారీగా పాజిటివ్‌ కేసులు వస్తుండ‌టంతో నాలుగు రోజుల్లోనే రెండు ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి.