Revanth:BJP..బ్రిటిష్ జనతా పార్టీ

12
- Advertisement -

బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రేవంత్..రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ విధానమని సిఎం ఆరోపించారు.

ఆనాడు బ్రిటీషర్లు సూరత్ చేరుకుని క్రమంగా దేశమంతా ఆక్రమించుకున్నారని, ఇప్పుడు సూరత్ వ్యాపారులు దేశాన్ని ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. బ్రిటీష్ వాల్ల వలే బీజేపీ వాళ్లకు కూడా రిజర్వేషన్లు నచ్చవన్నారు.

బీజేపీ కుట్రలను ఎంపి ఎన్నికల్లో మరోసారి తిప్పికొట్టాలని ప్రజలను సిఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సైనికులు మరోసారి అవిశ్రాంతంగా పోరాడాలని …రూ. 60లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను మోడీ అమ్మేశారని ఆయన ఆరోపించారు.

Also Read:ఓటీటీలోకి గోపీచంద్ “భీమా”

- Advertisement -