వెస్టిండీస్-దక్షిణాఫ్రికా సిరీస్ వాయిదా..

56
sa

కరోనా లాక్ డౌన్‌ కారణంగా అంతర్జాతీయంగా పలు క్రికెట్‌ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఐపీఎల్‌ ప్రారంభానికి లైన్ క్లియర్‌ కాగా మరోవైపు పలు టోర్నమెంట్‌లు వాయిదా పడుతూ వస్తూనే ఉన్నాయి. భారత్ -దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ అలాగే వాయిదా పడగా తాజాగా వెస్టిండీస్‌, శ్రీలంకలో సౌతాఫ్రికా జట్టు పర్యటన నిరవధికంగా వాయిదా పడింది.

దక్షిణాఫ్రికా జూలై-ఆగస్టులో రెండు టెస్టులు, ఐదు టీ20ల సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. అలాగే జూన్‌లో శ్రీలంకతో మూడు వన్డేలు,మూడు టీ20ల సిరీస్‌లో తలపడాల్సి ఉంది. శ్రీలంక, వెస్టిండీస్‌ టూర్ క్యాన్సిల్ అయినట్లు సఫారీ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.