11వ రోజు ఆగని పెట్రోమంట..

178
petrol
- Advertisement -

దేశంలో పెట్రో ధరల మంట ఆగడం లేదు. వరుసగా 11వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 31 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.45గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 87.55కి చేరగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 90.19 కి చేరగా డీజిల్‌ ధర రూ. 80. 60 కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ. 96.62, డీజిల్‌ రూ. 87. 32 కి చేరాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ సెంచరీ దాటగా హైదరాబాద్‌లో ఆల్‌టైం హైకి చేరింది. పెట్రోల్ ధరల పెంపుపై సోషల్ మీడియాలో మోదీ సర్కార్‌పై పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తుండగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు ప్రజలు.

- Advertisement -