తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం…

68
stalin

తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు స్టాలిన్. చెన్నైలోని రాజ్‌భవన్‌లో కరోనా నిబంధనల మధ్య నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగగా గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ ప్రమాణస్వీకారం చేయగా 34 మంది మంత్రులు సైతం ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు.

మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, కొందరు కీలక నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కేబినెట్‌ సమావేశమై.. కరోనా నివారణ చర్యలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.