రాష్ట్రంలో 24 గంటల్లో 5,892 కరోనా కేసులు…

35
ts

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో 5,892 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 46 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 73,851 యాక్టివ్ కేసులుండగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,81,640కు చేరాయి. ఇప్పటి వరకు 4,05,164 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 84.12 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54శాతంగా ఉందని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,104, రంగారెడ్డి జిల్లాలో 443, సిద్దిపేటలో 201 కేసులు నమోదయ్యాయి.