10 నుండి రాజస్థాన్‌లో లాక్‌డౌన్

58
rajasthan

దేశంలో కరోనా తీవ్రతకు ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించగా తాజాగా రాజస్థాన్ కూడా లాక్ డౌన్ బాటపట్టింది. 14 రోజుల పాటు అంటే ఈ నెల 10వ తేదీ నుంచి 24 ఉదయం 5 గంటల వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించింది.

వర్చువల్ సమావేశంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రాజస్థాన్‌కు వచ్చే ఏ వ్యక్తయినా 72 గంటలకు మించకుండా ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ చూపాల్సిందేనని వెల్లడించింది.

ఈ నెల 31 వరకు వివాహ వేడుకలపై నిషేధం ఉంటుందని…. అలాగే అన్ని మతపరమైన ప్రదేశాలు మూసివేస్తున్నట్లు తెలిపింది.