తమిళనాడులో పూర్తిస్దాయి లాక్ డౌన్….

60

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 14 రోజుల పాటు పూర్తి స్ధాయి లాక్ డౌన్ విధిస్తున్న్టట్లు ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 4 గంటల వరకు అమలులో ఉంటుందని వెల్లడించింది. కిరాణ, కూరగాయలు, మాంసం దుకాణాలు, ఫార్మాసీ దుకాణాలు మినహా మిగతా అన్ని దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 13.23లక్షలకు చేరాయి. చెన్నైలో కరోనా కారణంగా సగటు మరణాల సంఖ్య గత రెండు నెలల్లో వేగంగా పెరిగింది.