ఒకేసారి 68 హైకోర్టు జడ్జిలు…

127
nv ramana
- Advertisement -

దేశ చరిత్రలో తొలిసారి..ఒకేసారి 68 మంది హైకోర్టు జడ్జిల పేర్లను సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. దేశంలోని 12 హైకోర్టుల్లో ఏకంగా 68 హైకోర్టు జడ్జిల నియామకం జరగనుంది. ఇది భారత న్యాయ చరిత్రలో తొలిసారి కావడం విశేషం..

మొత్తం 112 మంది పేర్లను పరిగణనలోకి తీసుకుని.. 68 మంది పేర్లను సిఫారసు చేసింది.. ఇందులో 44 మంది బార్‌కు చెందిన వారుకాగా, 24 మంది జ్యుడిషియల్‌ సర్వీసుకు చెందినవారిగా తెలుస్తోంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియంలో జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ సభ్యులుగా ఉన్నారు. దీనిపై పెద్ద కసరత్తే చేసింది కొలీజియం.

కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. అలహబాద్ హైకోర్టుకు 13 మంది లాయర్లను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. అలహబాద్ హైకోర్టులో ప్రస్తుతం 92 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కేరళ హైకోర్టుకు 8 మంది ,జార్ఖండ్ హైకోర్టుకు ఐదుగురు,మధ్యప్రదేశ్ హైకోర్టుకు 1 లాయర్ ను న్యాయమూర్తిగా నియామకం చేస్తూ సిఫార్సులు ఇచ్చింది.

- Advertisement -