హైకోర్టు సీజేగా జస్టిస్ చౌహన్.. కొలీజియం సిఫార్సు

346
telangana cj
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆర్ఎస్‌ చౌహన్‌ను ప్రధానా న్యాయమూర్తిగా నియమించడానికి సుప్రీం సీజే జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలో కొలీజియం రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌కు సిఫారసు చేసింది. దీంతో పాటు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వి రామసుబ్రమణియన్‌ను హిమాచల్ ప్రదేశ్‌ సీజేగా నియమించాలని సిఫారసు చేసింది.

రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్‌ చౌహాన్‌‌ను తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగా గత ఫిబ్రవరి నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ 1959 డిసెంబరు 24న జన్మించారు. అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. క్రిమినల్, రాజ్యాంగ వ్యవహారాలు, సివిల్ సర్వీసెస్ అంశాల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు.

1996 నుంచి 2005 వరకు రాజస్థాన్ హైకోర్టులో ప్రాక్టీస్‌చేశారు. 2005 జూన్ 13న రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015 మార్చి 10న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. తర్వాత గత నవంబరు 23న ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జనవరిలో హైకోర్టు విభజన జరగడంతో ఆయనను తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ రాధాకృష్ణన్‌ బదిలీపై వెళ్లడంతో అప్పటి నుంచి జస్టిస్‌ చౌహాన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -