సుప్రీంకోర్టు..కొలిజియం తరహాలో సీఈసీ

50
- Advertisement -

ఎన్నికల కమిషనర్ల నియమాకంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని పై ముఖ్యమైన తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘంలో నియామకాల సంబంధించి…ప్రధాని లోక్‌సభలో ప్రతిపక్షనేత సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం 5-0మెజార్టీతో ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది.

సీఈసీ ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలిజియం లాంటి వ్యవస్థను రూపొందించాలని పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన సందర్భంగా…జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు ఈ తీర్పును వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ప్రస్తుతమున్న వ్యవస్థను రద్ధు చేస్తున్నట్లు తెలిపింది. వీరి నియామకాల కోసం కొత్త చట్టం తెచ్చేంతవరకు ఈ త్రిసభ్య కమిటీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలోని మెజార్టీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ..సీఈసీల తొలగింపు వలే ఉంటుందని కూడా ధర్మాసనం తన తీర్పులో తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి…

అదానీ…కమిటీ వేసిన సుప్రీంకోర్టు!

పారదర్శకత కోసమే బయోమెట్రిక్ విధానం..

జగన్ ఒంటరి పోరు.. అసలు కారణం అదే!

- Advertisement -