ఎక్స్‌ట్రా బజర్దస్త్ 350..గాడ్‌ఫాదర్‌ నాగబాబుని మర్చిపోయారు!

49
naga babu

జబర్దస్త్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారంలో రెండు రోజుల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో ఇది. ఈ ఒక్క షోతో చాలా మంది కమెడియన్ల జీవితాలు మారిపోయాయి. బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో లలో నెం1 స్ధానంలో ఉంది జబర్ధస్త్. ఈషోకు మొదటగా న్యాయనిర్ణేతలుగా వ్యవహిరించారు మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా. ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరిద్దరి వల్ల కూడా జబర్ధస్త్ షో ఇంత పాపులర్ అయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా నాగబాబు కంటెస్టెంట్‌లకు ఇచ్చిన నైతిక స్థైర్యం, మద్దతు సూపర్బ్. టీమ్ లీడర్ల స్కీట్ అద్బుతంగా రావడానికి,ప్రేక్షకుల మన్ననలు పొందడానికి తెరవెనుక ఆయన ఇచ్చిన సలహాలు మరువలేనివి. పలు సందర్బాలు టీమ్ లీడర్లే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

సీన్ కట్ చేస్తే….ఇదంతా గతం. అనివార్య కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ దూరమయ్యారు. మెగాబ్రదర్ స్థానంలో మను జడ్జిగా రాగా ప్రస్తుతం 350 ఎపిసోడ్‌ని పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో టీమ్ లీడర్లు తాము చేసిన స్కీట్‌ల అనంతరం తాము పడిన కష్టాల గురించి వివరించారు. భవిష్యత్‌లో ఈ వేదిక మీదకు రాబోయే వారికి తప్పకుండా తమవంతు సాయం చేస్తామని ప్రకటించారు. ఇక కొంతమంది జడ్జి రోజా మేడంపై ప్రశంసలు గుప్పించారు. కానీ ఈ షో ఇంతహిట్టై వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన నాగబాబును మర్చిపోయారు. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జబర్దస్త్ సభ్యుల జీవితాలను మార్చిన నాగబాబును ఎలా మర్చిపోతారని విమర్శలు గుప్పిస్తున్నారు.