ఉప్పల శ్రీనివాస్‌ని కలిసిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ

259
uppala
- Advertisement -

రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగా.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యుజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సూచించింది.

తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) వీసీ గా ప్రో. డి. రవీందర్ గుప్తా గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.సన్మానం జరిగిన తదనంతరం ఈ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా .. మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాతనే, ఆర్యవైశ్యులకు గుర్తింపు లభించింది అని, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ప్రాముఖ్యత పెరిగిపోయింది అని, ఆర్యవైశ్యులు అంటే అమితమైన నమ్మకం విశ్వాసం ఉందన్నారు.

40 సంవత్సరాల తర్వాత తొలిసారి తెలంగాణ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన D.రవీందర్ గుప్తా గారికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ గారికి, మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -