శ్రీలంకలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

37
- Advertisement -

రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పుల శ్రీనివాస్ గుప్తా నేతృత్వంలో మహిళలతో శ్రీలంక దేశంలో సీతమ్మ వాటిక (ఆశోక వాన ప్రగానం) లో 150 మంది ఐవిఏఫ్ ప్రతినిధులు 11 మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆత్మీయ సమావేశం శ్రీలంకలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్ గుప్తా కోశాధికారి కోడిపాక నారాయణ,ఉప్పల స్వప్న,మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి.. జెడ్పిటిసి సభ్యురాలు మేఘమాల ప్రభాకర్,మణిమాల,భువనేశ్వరి,శాంతి,శైలైజ,జ్యోతి ,తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ నాగమణి,గజ్వేల్ మున్సిపల్ కౌన్సలర్ నంగూనూర్ సత్యనారాయణ ,కోటగిరి దైవదినం,ఓరగంటి పరమేశ్వర్,రాము,నాగరాజు ,తోట బిక్షపతి,శివశంకర్,రమేష్, బిజ్జాలశ్రీనివాస్ ,టి వీరన్న, ఏ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:KTR:ఎంఎల్‌పీలతో ట్రాఫిక్ సమస్యకు చెక్

- Advertisement -