కేజీఎఫ్‌ 2…రావు రమేశ్ లుక్ రిలీజ్

90
kgf 2

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ కేజీఎఫ్ 2. హీరో యశ్‌ నటించిన కేజీఎఫ్‌ ఫస్ట్ పార్ట్‌కు మంచి స్పందన రాగా 2 పార్ట్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. జులై 16న చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో కీ రోల్ పోషించిన రావు రమేశ్ లుక్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. రాఘవన్ గా సిబిఐ ఉన్నతాధికారిగా కనిపించే రమేశ్‌ లుక్‌ని ప్రత్యేకంగా రూపొందించిన వార్తాపత్రిక కథనాన్ని పంచుకుంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.