ఊరికో జమ్మిచెట్టు..మొక్కలు నాటిన ఎమ్మెల్యే బాలరాజు

106
- Advertisement -

పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగుతున్న కార్యక్రమం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌. ఈ కార్యక్రమంలో భాగంగా ఊరు ఊరికో జమ్మిచెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు మొక్కలు నాటుతున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌ పేట్‌ గ్రామంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పర్యాటక శాఖ అభివృద్ధి చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తాతో కలిసి పూజలు నిర్వహించారు.

గువ్వల బాలరాజు, ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టును నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, ఐవీఎఫ్‌ పొలిటికల్‌ కమిటీ చైర్మన్‌ బచ్చు శ్రీనివాస్‌, శంబు పాండయ్య, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ జమ్మి చెట్టు ప్రాశస్త్యం గురించి చెప్పారు. తెలంగాణలోని దసరా పండుగ వేళ జమ్మి చెట్టును పూజించి బంగారంగా అందరికి పంచిపెట్టడం ఆనావాయితీగా వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యులను చేసిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -